కీర్తిశేషులు చందా హనుమంతరావు కు భద్రాచలం బార్ అసోసియేషన్ ఘన నివాళి –
రెండు నిమిషాల మౌనం పాటించి.. సమాజానికి న్యాయవాద వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడిన బార్ అసోసియేషన్…
భద్రాచలం, ఆగస్ట్ 11
భద్రాచలం కు చెందిన సీనియర్ న్యాయవాది చందా హనుమంతరావు అనారోగ్యంతో కన్నుమూయటంతో . వారి ఆకస్మిక మరణం భద్రాచలం న్యాయవాద సమాజానికి కుటుంబానికి తీరని లోటు అని బార్ అసోసియేషన్ సంతాప సందేశంలో ప్రకటించింది .
మరణించిన సీనియర్ న్యాయవాది చందా హనుమంతరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మంగళవారం ఉదయం గంటలకు భద్రాచలం బార్ అసోసియేషన్ హాల్‌లో ప్రత్యేక సంతాప కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి కీర్తిశేషులు చందా హనుమంతరావు కు ఘన నివాళి అర్పించారు.
ఈ సంతాప సభకు విచ్చేసిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివ నాయక్, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గాభవాని ప్రసంగించారు. చందా హనుమంతరావు సేవలను, న్యాయవాద వృత్తిలో వారు పాటించిన విలువలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.
”న్యాయవాద రంగంలో శ్రీ చందా హనుమంతరావు గారు అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని, వారి ఆత్మకు శాంతి కలగాలని” వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ శ్రీ సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పూసాల శ్రీనివాసాచారి, లేడి రిప్రజెంటేటివ్ తరుణి, మాజీ ప్రెసిడెంట్ కోట దేవదానం, సీనియర్ న్యాయవాదులు రావి రామ్మోహన్, ముత్యాల కిషోర్, పేరాల నాగరాజు, పేరాల వెంకటేశ్వర్లు, బండారు అరుణ్ చంద్, అవులూరి సత్యనారాయణ, కే అరుణ శ్రీ, పామరాజు తిరుమల రావు,, బండారు రమేష్, ఎం.వి రమ, భాష్యం శారద, దాట్ల సంధ్య,బి రామకృష్ణ, ఎమ్. సంధ్యారాణి వలవల సురేష్ కుమార్, రవితేజ కారం రమేష్, కోరాడ శ్రీనివాస్ , గాయత్రి, కొత్తపల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. అలాగే అసోసియేషన్‌కు చెందిన సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులు అర్పించారు. చందా హనుమంతరావు కుటుంబానికి భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది









