నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట, నర్సంపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను బీజేపీ నాయకులు పరామర్శించారు. చింతల శంకర్ రెడ్డి, కొండ సలేశ్వరం, వీరెడ్డి, ప్రమిల్లమ్మ తదితరులు మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా ఉంటారని తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఉపసర్పంచ్ రేపని శ్రీనివాస్, రామాంజనేయులు, సందీప్, ఆంజనేయులు, హనుమంతు, శివకుమార్, శ్రీశైలం, ప్రవీణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.









