నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నపురం, సుగాలిమెట్ట గ్రామాల్లో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం సుగాలిమెట్ట గ్రామంలో రూ.12 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా సుగాలిమెట్ట గ్రామానికి చెందిన వైసీపీ మాజీ వార్డు సభ్యుడు ఓబీ బాయ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









