మంచిర్యాల జిల్లాలో తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టి అనంతరం మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు భీమిని ఉదయ్ (23)ను అరెస్టు చేసినట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆగస్టు 11, 2026న భీమారం పోలీస్ స్టేషన్లో ఉదయ్‌ను విచారించగా.. తండ్రి లక్ష్మణ్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు సీఐ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ ప్రేమ వివాహం చేసుకోవడం అతని తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడిని, అతని భార్యను దూషిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ కారణంగా ఉదయ్ కిష్టంపేట నుంచి భీమారంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చి అక్కడ నివసిస్తున్నాడు. ఈ క్రమంలో 2025 జూలై 21న లక్ష్మణ్ భీమారంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉదయ్ భార్యను దూషిస్తూ గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వాంగ్మూలం ఆధారంగా హత్యకు దారితీసిన పరిస్థితులు, మృతదేహాన్ని తగులబెట్టిన విధానం తదితర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.









