చంద్రుడిపై స్థావరం.. భారత్‌కు నాసా కీలక ఆహ్వానం

చంద్రునిపై దీర్ఘకాలిక మానవ అన్వేషణ, పరిశోధనలకు సన్నాహాలు చేస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. భారత్‌ను కీలక భాగస్వామిగా ఆహ్వానించినట్లు సమాచారం. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా చేపడుతున్న చంద్ర స్థావరం కార్యక్రమంలో ఇస్రో కూడా భాగస్వామి కావాలని నాసా కోరినట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యంతో భారత్‌-అమెరికా అంతరిక్ష సహకారం మరింత బలోపేతం కానుంది.

బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో భారత్, అమెరికా అధికారుల మధ్య జరిగిన సమావేశంలో అంతరిక్ష శాస్త్రం, మానవ అంతరిక్ష యానం సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రునిపై భవిష్యత్ మానవ నివాసానికి సంబంధించిన ప్రణాళికల్లో ఇస్రో భాగస్వామ్యంపై నాసా ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్ర అన్వేషణలో భారత్‌ సాంకేతిక సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది.

చంద్రునిపై మనుషులు సుదీర్ఘకాలం నివసించి పనిచేసేలా స్థావరాన్ని ఏర్పాటు చేయడం నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రోవర్లు, రోబోట్లు, శాస్త్రీయ పరికరాలను చంద్రుడిపైకి పంపి అక్కడి నేల, వనరులపై పరిశోధనలు చేపట్టనుంది. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంలోని మంచు భవిష్యత్ మానవ మిషన్లకు కీలక వనరుగా భావిస్తున్నారు. ఆర్టెమిస్ మిషన్ ద్వారా ఈ లక్ష్యాల దిశగా నాసా ముందుకు సాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు