విజయవాడలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం.









