హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్ల లాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన ‘మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్’లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ, ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారని అన్నారు. మాటల్లో కాకుండా చేతల్లోనూ సమానత్వాన్ని చూపించిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని పేర్కొన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తుచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో మైనారిటీ యువత మెరుగైన స్థానాలు సాధించారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలు బహిరంగంగా అమ్ముడయ్యే పరిస్థితి ఏర్పడిందని, అర్హత లేని వ్యక్తులను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నియమించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, యూపీఎస్సీ విధానాలను అధ్యయనం చేశామని తెలిపారు.

అభ్యర్థుల ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయపరంగా పోరాడి ఉద్యోగాలు కల్పించామని సీఎం చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మైనారిటీ సభ్యుడిని నియమించామని తెలిపారు. అలాగే అజారుద్దీన్‌కు మంత్రి పదవి, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల బహుమతి, మహమ్మద్ సిరాజ్‌కు నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం కల్పించినట్లు వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు