మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్‌షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను ఎంతో ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు.
ఆ రిలేషన్‌షిప్ కారణంగా తన మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నాయని అనుపమ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు తన కెరీర్‌పైనా ఆ ప్రభావం పడిందని చెప్పారు. తాను ఇష్టపడే పనిపై దృష్టి పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించిందని వెల్లడించారు. భవిష్యత్తులో వివాహం చేసుకుంటే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని భావించినట్లు తెలిపారు.
తన పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత ఆ బంధం నుంచి బయటకు రావడమే సరైన నిర్ణయమని భావించి రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికినట్లు అనుపమ చెప్పారు. ప్రస్తుతం జీవితంలో కొత్త దశను ప్రారంభించానని, గత అనుభవాల నుంచి బయటపడుతూ తనను తాను తిరిగి నిర్మించుకోవడం, మానసిక ప్రశాంతతను పొందడం, కెరీర్‌పై దృష్టి పెట్టడమే తన ప్రాధాన్యతలని తెలిపారు. అయితే తన మాజీ ప్రియుడి పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. అనుపమ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.









