లోక్‌సభ చరిత్రలో తొలిసారి.. ‘వందేమాతరం’తో ప్రారంభమైన సభ

భారత పార్లమెంటు చరిత్రలో గురువారం ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా లోక్‌సభ కార్యకలాపాలు జాతీయ గేయం ‘వందేమాతరం’తో ప్రారంభమయ్యాయి. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఎంపీలంతా గౌరవంగా నిలబడి వందేమాతరం ఆలపించారు.

ఈ సందర్భంగా ‘వందేమాతరం’లోని పూర్తి ఆరు చరణాలను సభలోని ప్రజాప్రతినిధులంతా ఏకకంఠంతో ఆలపించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా సాగిన ఈ కార్యక్రమం పార్లమెంటులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంపీలంతా ఒకే వేదికపై నిలబడి జాతీయ గేయాన్ని ఆలపించడం సభలో ప్రత్యేక వాతావరణాన్ని నెలకొల్పింది.

వందేమాతరం ఆలాపన కార్యక్రమం ముగిసిన అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో గురువారం నాటి లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా వందేమాతరంతో సభ ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు