రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొంతల లావణ్య (30) గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆమె నిండు గర్భిణిగా ఉన్నట్లు సమాచారం.
లావణ్యకు భర్త సురేష్‌తో పాటు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లావణ్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉందని తెలిపారు.









