లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ‘వెంకీ అనిల్ 5’ స్పెషల్ లుక్ వైరల్

టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్‌ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన వెంకటేష్‌ స్పెషల్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘వెంకీ అనిల్ 5’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఐదో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వెంకటేష్‌ సరికొత్త లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. లెఫ్టినెంట్ కల్నల్ పాత్రలో ఆయన కనిపించనున్నారనే ప్రకటనతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. విడుదలైన పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ‘40 Glorious Years’ సందర్భంగా మేకర్స్‌ ఇచ్చిన ఈ స్పెషల్ ట్రీట్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు