ప్రముఖ నటి రష్మిక మందన్న ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో తన రోజువారీ జీవితం ఎలా సాగుతోందో తెలియజేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే తనకు ఈ విశ్రాంతి సమయం కొత్తగా అనిపిస్తోందని ఆమె తెలిపారు.
ఎప్పుడూ తీరిక లేకుండా బిజీగా గడిపే వారికి విశ్రాంతి తీసుకోవడం కూడా కొంత భయంగా అనిపిస్తుందని రష్మిక పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు గతంలో బిజీగా గడిచిన రోజులను గుర్తు చేసుకుంటే భయం కలుగుతుందని ఆమె తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
‘‘క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి అనేది భయంగా అనిపిస్తుంది. బహుశా.. జీవితం అంటే ఇదేనేమో?’’ అంటూ రష్మిక తన భావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె త్వరగా కోలుకుని తిరిగి సినిమాలతో బిజీ కావాలని ఆకాంక్షిస్తున్నారు.









