Today 9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు రైతులకు అందిస్తున్న విశిష్ట సేవలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల అమలులో చూపుతున్న ప్రతిభ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా మణుగూరు వ్యవసాయ విస్తరణ అధికారి డా. కొమరం లక్ష్మణరావు ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు సంయుక్తంగా డా. కొమరం లక్ష్మణరావుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను చేరువ చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయడం, పంటల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం, రైతులకు సకాలంలో సలహాలు, సూచనలు అందించడం వంటి సేవలకు గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రం లభించింది.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు డా. కొమరం లక్ష్మణరావును అభినందించారు.









