అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి.. కావాలని అడ్డుపడితే పోలీస్ సహకారం తీసుకోండి.. మంత్రి తుమ్మల ఆదేశం .
Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు..
మారేళ్లపాడు ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తే, మేము రాజకీయం చేస్తాం, మర్యాదగుంటే వారికి ఏం కావాలో సహకరిస్తాం.. లేదంటే బలవంతంగా నైనా పనులు నిర్వహిస్తాం అని ఘాటుగా వ్యాఖ్యానించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .. ఈ నెలాఖరి కల్లా పనులు పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు .
లిఫ్ట్ పనులకు ఎటువంటి అడ్డంకులు లేవని ..కాగా ఇప్పటివరకు పనులు ఎందుకు పూర్తి చేయలేదు..అని మంత్రి తుమ్మల అధికారులను ప్రశ్నించారు ..
ఆగస్టు 15 కల్లా మారేళ్లపాడు సాగునీటిని అందించాలని గతంలో తుమ్మల ఆదేశించారు.. కాగా నేటి వరకు లిఫ్ట్ పనులు పూర్తి కాకపోవడంతో గుత్తేదారులపై మంత్రి తుమ్మల మండిపడ్డారు, పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు.









