గత ప్రభుత్వాలు ఏటిసి కేంద్రాల పట్ల నిర్లక్ష్యం వహించాయి.. మంత్రి వివేక్ వెంకటస్వామి.

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
కార్యక్రమం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు నెలకొల్పడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించటంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి, ఏటీసీ సెంటర్లకు గత ప్రభుత్వాలు పైసా కూడా ఖర్చు చేయక పోవడం బాధాకరం,
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్లు నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలు నెలకొల్పింది…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాటా సంస్థతో చర్చించి 2000 కోట్లు రూపాయలు పి ఎస్ ఆర్ నిధులతో ఏటిసి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
తెలంగాణలో విద్యార్థులు స్కీల్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 65 ఐటిసి సెంట్రల్ తో పాటు మరికొన్ని 56 ఏటీసీ సెంటర్లు నెలకొల్పింది. అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా విద్యార్థులు కొత్తగా ఎలక్ట్రికల్ వాహనాలు రూపొందించడం అభినందనీయం. శిక్షణ కేంద్రాలు ఆర్థికపరమైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాభృతి కల్పిస్తుంది అని మంత్రి తెలియజేశారు ఇలాంటి స్కిల్ సెంటర్లను విద్యార్థులు ఉపయోగించుకొని వారి భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు చేర్చుకునే విధంగా ఉపయోగించుకోవాలని వాక్యానించడం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు