విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ ‘హార్ట్ ఏరోస్పేస్’ రూపొందించిన ‘ఎక్స్-1’ (X-1) అనే ఈ విమానం, న్యూయార్క్‌లోని ప్లాట్స్బర్గ్ విమానాశ్రయం వేదికగా సుమారు 27 నిమిషాల పాటు ఆకాశంలో నిర్విఘ్నంగా విహరించింది. పర్యావరణహిత, గ్రీన్ ఎనర్జీ ప్రయాణాల దిశగా జరిగిన ఈ పరీక్షా యాత్ర ఏవియేషన్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ ప్రయాణానికి అయిన ఖర్చు అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాంప్రదాయ ఏవియేషన్ ఇంధనాలతో పోలిస్తే ఇది అత్యంత చవకైన ప్రయాణంగా రికార్డు సృష్టించింది. 27 నిమిషాల పాటు గగనతలంలో సాగిన ఈ విమాన ప్రయాణానికి కేవలం 5 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.420) విలువైన విద్యుత్ మాత్రమే ఖర్చు కావడం విశేషం.
ఈ ఎలక్ట్రిక్ విమానం మొత్తం 30 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండగా, మొదటి పరీక్షా యాత్ర కావడంతో కేవలం పైలట్ మాత్రమే ఇందులో ప్రయాణించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇది 1 మెగావాట్‌కు పైగా సామర్థ్యం కలిగిన శక్తివంతమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ ప్రాపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. భవిష్యత్తులో కర్బన ఉద్గారాలను (కార్బన్ ఎమిషన్స్) పూర్తిగా నిర్మూలించడంలో ఈ విద్యుత్ విమానాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.








