ఇరుముడి జోరు.. పెద్ది ఫుట్‌ఫాల్స్ రికార్డ్ బద్దలు!

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో భారీ ఫుట్‌ఫాల్స్ సాధించిన సినిమాల్లో రామ్ చరణ్ ‘పెద్ది’ను కూడా ‘ఇరుముడి’ వెనక్కి నెట్టింది. మొదటి ఆదివారం థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఆన్‌లైన్‌లో ట్రాక్ అవుతున్న షోల ప్రకారం.. మొదటి ఆదివారం ‘పెద్ది’ 9.47 లక్షల టికెట్లు విక్రయించగా, ‘ఇరుముడి’ దాదాపు 11 లక్షల టికెట్లను విక్రయించి ఆ రికార్డును అధిగమించింది. సినిమాకు లభించిన పాజిటివ్ టాక్‌తో పాటు మౌత్ పబ్లిసిటీ బలంగా పనిచేయడంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చారు.

అయితే వసూళ్ల విషయంలో మాత్రం ‘పెద్ది’ ముందంజలో నిలిచింది. 9.47 లక్షల టికెట్లతో ‘పెద్ది’ రూ.20.50 కోట్ల గ్రాస్ సాధించగా, 11 లక్షల టికెట్లతో ‘ఇరుముడి’ రూ.16.88 కోట్లు రాబట్టింది. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరల్లో ఉన్న వ్యత్యాసమే. ‘పెద్ది’ సగటు టికెట్ ధర రూ.216 ఉండగా, ‘ఇరుముడి’ టికెట్ ధర సగటున రూ.153గా ఉంది. తక్కువ ధరల కారణంగా సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు ‘ఇరుముడి’కి ఎక్కువగా రావడం ఫుట్‌ఫాల్స్ పెరగడానికి కారణమైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share