తమను తాము ప్రేమించుకోవడం, వ్యక్తిగత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని నటి నర్గీస్ ఫక్రీ చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలని, తమ గురించి తాము శ్రద్ధ తీసుకోవడం కూడా జీవితంలో ముఖ్యమైన భాగమేనని ఆమె సూచించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నల్లటి సూట్లో స్టైలిష్గా కనిపిస్తున్న ఫొటోను నర్గీస్ ఫక్రీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కెమెరా వైపు చూస్తూ ఆమె ఇచ్చిన పోజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోతో పాటు మహిళలు తాము కోరుకునే వ్యక్తిగా ఎదగాలంటే ముందుగా తమను తాము పట్టించుకోవడం అవసరమనే సందేశాన్ని ఆమె ఇచ్చారు.
“మిమ్మల్ని మీరు చూసుకోవడానికి సమయం కేటాయించండి.. ఆ ప్రయత్నానికి మీరు అర్హులు” అంటూ నర్గీస్ ఫక్రీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. తమ కోసం సమయం కేటాయించుకోవాలనే ఆమె సందేశంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.









