Quantum Battery: బ్యాటరీ పెద్దదైతే.. ఛార్జింగ్ మరింత వేగంగా! శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ

సాధారణంగా బ్యాటరీ సామర్థ్యం, పరిమాణం పెరిగే కొద్దీ దాన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే క్వాంటమ్ ప్రపంచంలో దీనికి పూర్తి భిన్నమైన పరిణామం చోటుచేసుకుంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలి పనిచేసే క్వాంటమ్ బ్యాటరీ ప్రోటోటైప్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ సాంకేతికత భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్ రంగంలో కీలక మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.

ఈ క్వాంటమ్ బ్యాటరీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని క్వాంటమ్ భాగాల సంఖ్య పెరిగే కొద్దీ ఛార్జింగ్ వేగం కూడా పెరుగుతుంది. సాధారణ బ్యాటరీల్లో కనిపించే పరిమితులకు భిన్నంగా క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా ఈ వేగవంతమైన ఛార్జింగ్ సాధ్యమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే అవకాశాలపై పరిశోధనలు సాగుతున్నాయి.

ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలో ఉన్న ప్రోటోటైప్‌ మాత్రమే అయినప్పటికీ.. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర చిన్న తరహా సాంకేతిక పరికరాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలపై ఆసక్తి పెరుగుతోంది. అయితే సాధారణ వినియోగానికి అందుబాటులోకి రావాలంటే మరింత పరిశోధన, అభివృద్ధి అవసరం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు