పాఠశాలలో విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమైన అధికారి.. మధ్యాహ్న భోజనంపై ప్రశంసలు

పాఠశాల తనిఖీలో భాగంగా అన్నం, వంకాయ ఆలుగడ్డ కూర, పప్పు చారును పరిశీలించారు. కూరల నాణ్యత చాలా బాగుందని అభినందించారు. విద్యార్థులు ఎంతో ముద్దుగా ఉన్నారని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం స్వయంగా పిల్లలకు పళ్లెంలో అన్నం, కూరలు వడ్డించారు. అన్నం, కూర కలుపుకుని శుభ్రంగా తినాలని, పిల్లలు భోజనం చేసేటప్పుడు అవసరమైన సహాయం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

పాఠశాల వాతావరణం చాలా బాగుందని ప్రశంసించారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను సమర్థవంతంగా నేర్పించాలని సూచించారు. పాఠశాలను ఇదే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రిన్సిపల్‌ను అభినందించారు. ప్లే స్కూల్‌లో భాగంగా ఏర్పాటు చేసిన గదిని పరిశీలించి, విద్యార్థులు ఆడుకోవడానికి, కూర్చోవడానికి ఏర్పాటు చేసిన వివిధ సామగ్రిని పరిశీలించారు.

రంగురంగుల వస్తువులు, ఆట వస్తువులతో ఆడుకోవడం పిల్లలకు ఎంతో ఇష్టమని, వాటితో వారు ఆనందంగా గడుపుతారని తెలిపారు. అయితే పిల్లలు ఆడుకునే సమయంలో కిందపడకుండా, ఒకరితో ఒకరు గొడవపడకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. విద్యార్థుల భద్రతతో పాటు వారి ఆనందం, అభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share