సీఎస్‌కే కొత్త కోచ్‌గా దినేశ్ కార్తీక్‌.. మాథ్యూ హెడెన్ కీలక ప్రతిపాదన

చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో కొత్త కోచ్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు పలువురు విదేశీ దిగ్గజాల పేర్లు తెరపైకి వస్తున్న వేళ.. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ సరికొత్త ప్రతిపాదన చేశారు.

తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను సీఎస్‌కే ప్రధాన కోచ్‌గా నియమించాలని హెడెన్ సూచించారు. జట్టుతో పాటు తమిళనాడు క్రికెట్ సంస్కృతిపై మంచి అవగాహన ఉన్న దినేశ్ కార్తీక్ ఈ బాధ్యతలకు అత్యంత సరైన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎస్‌కేకు తమిళనాడు అభిమానులతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుంటే స్థానిక ఆటగాడికి కోచ్ బాధ్యతలు అప్పగించడం మంచి నిర్ణయమని హెడెన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్‌కే తదుపరి కోచ్‌గా దినేశ్ కార్తీక్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు