మార్కెట్‌లోకి Ai+ Nova 2 Power.. లాంచ్‌కు ముందే పబ్లిక్ రివ్యూ!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Ai+ మరో ఆసక్తికరమైన మోడల్‌ను తీసుకొస్తోంది. తమ పాపులర్ Nova 2 సిరీస్‌లో భాగంగా Nova 2 Power 5Gను పరిచయం చేసింది. అయితే ఇతర బ్రాండ్లకు భిన్నంగా.. కలర్‌ఫుల్ యాడ్స్, భారీ ప్రమోషన్ల కంటే వినియోగదారుల నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది.

ఇందులో భాగంగా “Project Open Review 2.0” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫోన్ మార్కెట్లోకి రాకముందే టెక్ రివ్యూవర్స్, కంటెంట్ క్రియేటర్స్, జర్నలిస్ట్స్, టెక్నాలజీ ఎంథూసియస్ట్స్‌తో పాటు తొలిసారిగా ఎథికల్ హ్యాకర్లకు కూడా ఫోన్‌ను అందించి స్వతంత్రంగా పరీక్షించే అవకాశం కల్పిస్తోంది. పనితీరు, సాఫ్ట్‌వేర్ స్టెబిలిటీ, థర్మల్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ వంటి అంశాలను పరిశీలించవచ్చు.

ఫోన్‌లో MediaTek Dimensity 7100 చిప్‌సెట్, NxtQuantum OS ఉన్నాయి. అలాగే Golden Blue Fusion, Blue Fusion అనే రెండు కలర్ ఆప్షన్లను కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ఎలాంటి స్క్రిప్ట్ లేదా ముందుగా నిర్ణయించిన అభిప్రాయాలు లేకుండా రివ్యూవర్లు తమకు నచ్చిన విధంగా ఫోన్‌లోని ప్లస్‌లు, మైనస్‌లను చెప్పేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share