Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు..
మణుగూరు సింగరేణి ఏరియాలో గ్రౌండ్స్ లో సింగరేణి కాలనీకి చెందిన ఎంకే గ్యాంగ్ కు చెందిన యువకులు, మణుగూరుకు గాంధీ బొమ్మకు సెంటర్ కి చెందిన కొందరు యువకుల మధ్య చెలరేగిన వివాదం ముదిరిపోవటంతో.. ఎంకే గ్యాంగ్ కు చెందిన యువకులుచొక్కాలు విప్పి దూసుకుంటూ వెళ్లి మణుగూరు చెందిన యువకులపై దాడికి పాల్పడ్డారు . ఈ ఘర్షణలో ఎంకే గ్యాంగ్ కు చెందిన యువకులు సుమారు 25 మంది రాగా, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతానికి చెందిన యువకులు సుమారు 15 మంది వరకు ఈ ఘటనలో పాలు పంచుకున్నట్టు తెలియ వచ్చింది..
కాగా గాంధీ బొమ్మకు సెంటర్ కు చెందిన యువకులను ఎం.కె గ్యాంగ్ 25 మంది విచక్షణా రహితంగా దాడి చేయడంతో. శివ (28)అనే యువకుడు మృతి చెందాడు.. సమాచారం తెలుసుకుని సంఘటన జరిగిన స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీస్ సిబ్బంది ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
అయితే ఈ సంఘటనకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని , నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు..









