సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
షెడ్యూల్ ప్రకటించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించనుంది.. సెప్టెంబర్ 1 నుండి వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిరసనల హోరు చేపట్టాలని నిర్ణయించుకుంది.
సెప్టెంబర్ 1: తెలంగాణ భవన్‌లో లోగో ఆవిష్కరణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనుంది…
సెప్టెంబర్ 2: ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించనున్నారు..
సెప్టెంబర్ 3: వ్యవసాయ విధ్వంసం, నిషేధిత జాబితా భూములు, నీటిపారుదల, విద్యుత్, యూరియా మరియు రైతు బీమా అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ 4: వృద్ధులు, వికలాంగులు, మహిళల సదస్సులు, మహిళలకు రూ. 2500, కేసీఆర్ కిట్ బంద్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల అంశాలపై నిరసనగా వంట వార్పు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువతతో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ వైఫల్యం, యూత్ డిక్లరేషన్ అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు. ఆదిలాబాద్ మరియు సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసనలు, సదస్సులు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 6: హైదరాబాద్ అదే కోవలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖాన కోసం ఆటోల భారీ ర్యాలీ, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల విధ్వంసంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 7: జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై సామూహిక వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం.. సెప్టెంబర్ 8న : జిల్లా కేంద్రాల్లో 7 రోజుల నిర్వహించిన కార్యక్రమాలపై ప్రెస్‌మీట్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాల అందజేత తదితర కార్యక్రమాలను నిర్వహించడానికి పార్టీ పూనుకుంది.
సెప్టెంబర్ 10: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించటం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలియజేశారు.









