సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

షెడ్యూల్ ప్రకటించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ 1000  రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించనుంది.. సెప్టెంబర్ 1 నుండి వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిరసనల హోరు చేపట్టాలని నిర్ణయించుకుంది.

సెప్టెంబర్ 1: తెలంగాణ భవన్‌లో లోగో ఆవిష్కరణ  కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనుంది…

సెప్టెంబర్ 2: ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించనున్నారు..

సెప్టెంబర్ 3: వ్యవసాయ విధ్వంసం, నిషేధిత జాబితా భూములు, నీటిపారుదల, విద్యుత్, యూరియా మరియు రైతు బీమా అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించింది.

సెప్టెంబర్ 4: వృద్ధులు, వికలాంగులు, మహిళల సదస్సులు, మహిళలకు రూ. 2500, కేసీఆర్ కిట్ బంద్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల అంశాలపై నిరసనగా వంట వార్పు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 5: విద్యార్థులు, యువతతో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ వైఫల్యం, యూత్ డిక్లరేషన్ అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు. ఆదిలాబాద్ మరియు సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసనలు, సదస్సులు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 6: హైదరాబాద్ అదే కోవలో  రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో తాగునీరు, వీధి దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖాన కోసం ఆటోల భారీ ర్యాలీ, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల విధ్వంసంపై నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 7: జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై సామూహిక వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం.. సెప్టెంబర్ 8న : జిల్లా కేంద్రాల్లో 7 రోజుల నిర్వహించిన కార్యక్రమాలపై ప్రెస్‌మీట్  అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాల అందజేత తదితర కార్యక్రమాలను నిర్వహించడానికి పార్టీ పూనుకుంది.

సెప్టెంబర్ 10: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం ప్రకటించటం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ నేత నిరంజన్ రెడ్డి  తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు