ఫోన్ కోసం.. ఓ వ్యక్తిని చంపిన ఇద్దరు దుండగులు..
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్‌లో ఘటన…
హైదరాబాద్ లో ఫోన్ కోసం ఒక వ్యక్తిని చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది… వివరాల్లోకి వెళితే..నేపాల్‌కు చెందిన నాగేంద్ర మాఝీ తన భార్య చంద్రతో కలిసి అత్తాపూర్‌లో నివాసం ఉంటున్నాడు.ఆగస్టు 24న రాత్రి 11 గంటలకు సిగరెట్ తాగి వస్తానని భార్యకు చెప్పి వెళ్లిన నాగేంద్ర ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. ఒంటి గంట సమయంలో వెతుక్కుంటూ వెళ్లిన భార్యకు ప్రణవ విల్లాస్ వద్ద నాగేంద్ర విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులకి సమాచారం అందించింది.
కేసు నమోదు చేసుకుని మిస్టరీగా మారిన ఈ కేసుని రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి దర్యాప్తు ప్రారంబించారు.సీసీ కెమెరాలు, టెక్నాలజీ సాయంతో.. నాగేంద్ర మరణానికి సెల్‌ఫోన్ స్నాచింగ్ కారణమని గుర్తించారు.నాగేంద్రపై మహ్మద్ సూఫియాన్, ఓ మైనర్ దాడి చేసి.. సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీస్ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.,రిమాండ్‌కు తరలించారు.









