MK గ్యాంగ్ కోసం గాలిస్తున్న పోలీసులు.. MK గ్యాంగ్ కుర్రోళ్ళు పరార్.
Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
MK గ్యాంగ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలి.. మృతుని తండ్రి.
నా కొడుకు చావు కారణమైన వారిని, ఎవరిని పోలీసులు వదలద్దు.. MK గ్యాంగ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంటున్న.. తండ్రి
నిన్న గ్యాంగ్ వార్ లో జరిగిన ఘటన పై పోలీసులు శివ మృతి కి కారణమైన యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు. శివ (28) మృతి చెందడంతో పరారైన MK గ్యాంగ్ కుర్రోళ్ళు. ఈ MK గ్యాంగ్లో మణుగూరు లోని అన్ని ఏరియాల నుండి యువకులు ఉండడం ఆశ్చర్యం.
MK గ్యాంగ్ వార్నింగ్… శివ పై దాడి చేసే వెళుతున్నామని మరో ఇద్దరికి ఫోన్ చేసి వార్నింగ్.
మణుగూరు పట్టణంలో MK గ్యాంగ్ శివ పై మేమే దాడి చేశాము అంటూ మరి కొందరికి విషయం తెలుపుతూ ఫోన్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో వార్నింగ్ ఇస్తున్న ఆడియోలు ప్రత్యక్షమవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతూ ఉండడం ప్రజలవంతయింది.
ఇదిలా ఉంటే నేతాజీ గ్రౌండ్ నందు ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాకింగ్ కి ఉదయం సాయంత్రం వస్తు ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ, ఇటు పోలీస్ రిక్రూట్మెంట్స్, ఆర్మీ రిక్రూట్మెంట్స్, ఇంకా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు అణువుగా ఉండేటటువంటి ఈ యొక్క గ్రౌండ్ నందు ఇలా ఉన్నట్టుండి గ్యాంగులతోటి దాడులు జరగడం పట్టణ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
మృతుడి హత్యలో పాల్గొన్న MK గ్యాంగ్కు సంబంధించిన వారిని ఎవరిని విడిచిపెట్టబోమని మణుగూరు పోలీస్ సిబ్బంది తెలియజేశారు.









