దాడి చేసి హత్య చేసిన విషయాలను వేల్లడించిన పోలీసులు..

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు పాత గొడవల నేపథ్యంలో యువకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి హత్య చేసిన ఘటన మణుగూరులో చోటుచేసుకుంది. మృతుడు సింహాద్రి శివకుమార్ @ శివ (28) హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శివ వద్ద పనిచేసే సుందరయ్య నగర్ కు చెందిన సతీష్‌ తో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న MK గ్యాంగ్ లీడర్ అయిన రమాకాంత్ @ రమ్మీ @ జెట్టి మరియు అతని అనుచరులు శివను మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్ ద్వారా బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో 27-08-2026 ఉదయం 07.00 గంటలకు హైదరాబాద్ నుండి మణుగూరుకు వచ్చాడు. MK గ్యాంగ్ లీడర్ రమాకాంత్ @ రమ్మీ @ జెట్టి ఫోన్ చేసి శివ ను నేతాజీ గ్రౌండ్ కు రమ్మనగా శివ తన ఇంటి ప్రక్కన ఉన్న ఉదయ్‌కుమార్‌ తో కలిసి నేతాజీ గ్రౌండ్‌కు వెళ్లగా, అక్కడ ముందుగా పథకం ప్రకారం వేచి ఉన్న రమాకాంత్ @ జెట్టి, భరత్, సాధిక్, వినయ్, ధినేష్, జంపయ్య, ప్రసాద్ తదితరులు శివపై మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉదయ్‌కుమార్‌పై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు సుమారు మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share