సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. నేరం అంగీకరిస్తూ నిందితుడి దరఖాస్తు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025 జనవరి 16న ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఈ దాడి జరిగింది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఓ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, ఆయన కుమారుడి గదివైపు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను రక్షించే క్రమంలో సైఫ్ అతడిని ఎదుర్కొన్న సమయంలో నిందితుడు కత్తితో దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో కత్తి విరిగిన భాగం ఆయన శరీరంలోనే ఉండిపోవడంతో శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సైఫ్‌కు ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మహ్మద్ షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను కస్టడీలో ఉన్నాడు. తాజాగా నేరాన్ని అంగీకరిస్తూ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తుతో కేసు విచారణపై మరోసారి ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు