రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన… కూనంనేని

ప్రభుత్వంపై  సంచలన వ్యాఖ్యలు చేసిన కూనంనేని..

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదన్నారు.  ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించే ఏ పాలకులైనా ఎక్కువ కాలం మనలేరు అని అభిప్రాయం వ్యక్తం చేశారు సాంబశివరావు. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతుందని. ఏ శాఖ కూడా సరిగ్గా పనిచేయటం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు కొత్తగూడెం ఎమ్మెల్యే….

రాష్ట్రంలో మంత్రులకు స్వేచ్ఛ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులని, వారు స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే సామర్థ్యం లేకుండా పోయిందని, మంత్రులకు వాళ్ల శాఖ డబ్బులు సాంక్షన్ చేసే అధికారం లేదన్నారు.  కావలసిన నిధుల  విడుదల కోసం వాళ్లు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది  అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సాంబశివరావు.

దీని వల్ల ఒక్క పని కూడా కావడం లేదు, ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదన్నారు, ఏమైనా అంటే డబ్బులు లేవు అంటున్నారు, డబ్బులు లేనప్పుడు బడ్జెట్లో ఎందుకు పెడుతున్నారు అని ప్రభుత్వాన్నిి సూటిగాా ప్రశ్నించారు కొత్తగూడెం ఎమ్మెల్యే.

రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పథకాలకు నిధులను కేటాయిస్తున్నామని చెబుతున్నారే కానీ నిధుల విడుదలలో మాత్రం జాప్యం ఎక్కువగా కనిపిస్తుందని అన్నారు. ఇందువల్ల జరగాల్సిన అభివృద్ధి జరగకపోగా అభివృద్ధి కుంటుపడి  పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ ఎంఎల్ఏ  సాంబశివరావు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు