బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కి వినతి పత్రం సమర్పణ..

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కి వినతి పత్రం సమర్పణ..

భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జె. శ్రీనివాసరావు  , తెలంగాణ హైకోర్టు జస్టిస్ బీమపాక నగేష్ , జస్టిస్ ఖాజా శరత్ లకు భద్రాచలం ప్రాంత న్యాయవాదులు, కక్షిదారులు ప్రజల న్యాయ ప్రయోజనాలను కల్పించవలసిందిగా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు .

భద్రాచలం మణుగూరు పోలీస్ సబ్‌-డివిజన్లకు సంబంధించిన 600కు పైగా సెషన్స్ ట్రయల్ కేసులు వివిధ సెషన్స్ కోర్టుల్లో విచారణకు పెండింగ్‌లో ఉన్న పరిస్థితిని ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిల దృష్టికి తీసుకెళ్లారు . ఈ కేసుల విచారణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను న్యాయమూర్తులకు వివరించారు .

ఈ నేపథ్యంలో ప్రజలకు న్యాయం మరింత చేరువగా, సత్వరంగా అందే విధంగా భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు / అసిస్టెంట్ సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయడం లేదా సెషన్స్ కోర్టును భద్రాచలంలో ఏర్పాటు చేసి భద్రాచలాన్ని ప్రధాన కేంద్రంగా నిర్ణయించడం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు .

 

అదే విధంగా భద్రాచలం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా న్యాయవాదుల హాలులో ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి, పరిశుభ్రమైన క్యాంటీన్, జిరాక్స్ సదుపాయం, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరడం జరిగింది.

 

భద్రాచలం ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక, చారిత్రక, భౌగోళిక, గిరిజన ప్రాధాన్యతను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1), ఐదవ షెడ్యూల్ పరిధిలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని లో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భద్రాచలం బార్ అసోసియేషన్ తరపున న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని భద్రాచలం బార్ అసోసియేషన్ బాధ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, హైకోర్టు న్యాయవాదులు పివి కృష్ణమాచారి, సీనియర్ న్యాయవాది పోకల మోహన్ కృష్ణ, ముత్యాల ప్రవీణ్, బి రామకృష్ణ, వలవల సురేష్ కుమార్, ఏ. రజని, దన్నాన తరుణ్ నాయుడు, హైమావతి, మరియు హైకోర్టు మాజీ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్,ex.జి. పి. ఎం రాము తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు