టాలీవుడ్‌లోకి ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్!

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 21న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.250 కోట్ల మార్క్‌కు చేరువవుతోంది.

మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుండగా, తమిళ వెర్షన్ కూడా అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సౌత్ ఇండియాలో ఎలాంటి స్పందన లభిస్తుందనే ఆసక్తి నెలకొంది.

తొలుత ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ను తెలుగులో రీమేక్ చేయాలని భావించినప్పటికీ, మైత్రీ మూవీ మేకర్స్ నేరుగా తెలుగు డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా? నివిన్ పౌలీ, మమితా బైజు కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు