పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్‌ను ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న నాయకుడిగా అభివర్ణిస్తూ.. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనలో పవన్ కల్యాణ్ ముందుండి కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రజాదరణ పొందిన నాయకుడిగా పవన్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ నిరంతరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ మరింత కాలం సమాజ సేవలో కొనసాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మోదీ చేసిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలపై జనసేన, పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు