పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రవీందర్‌రెడ్డి. 

Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టాలి.

పినపాక మండలంలోని, ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం స్వీకరించి, వాటిపై నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

యువతను ప్రభావితం చేస్తున్న గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చర్యలు చేపట్టాలని డీఎస్పీ స్పష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సీసీటీఎన్‌ఎస్‌ అప్‌డేషన్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్‌ అందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ రవీందర్‌రెడ్డి సిబ్బందికి సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు