జాతీయ స్థాయిలో ఏకీకృత జల భద్రత ప్రణాళికకు మంత్రి ఉత్తమ్ పిలుపు

దేశవ్యాప్తంగా ప్రతి జల సంరక్షణ పనిని ఒకే జల భద్రత ప్రణాళికలో భాగం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు, బాధ్యత వహించే సంస్థ, కొలిచే ఫలితం ఉండాలని సూచించారు.

తెలంగాణలో 44,360 చెరువులు, జల వనరులు ఉండగా 28,739 చోట్ల పనులు చేపట్టారు. 22,428 జల వనరుల పునరుద్ధరణ పూర్తయిందని వెల్లడించారు. 74 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో 74.51 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం ఏర్పడిందన్నారు.

ఇది ఇలా ఉండగా 2026-29 మూడేళ్ల ప్రణాళికలో రూ.46,110.35 కోట్లతో 17.28 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయాలను కల్పించడం లేని పక్షంలో స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని కోరారు.

రాష్ట్రంలోని 159 భారీ, మధ్యతరహా రిజర్వాయర్ల సామర్థ్యం సుమారు 929 టీఎంసీలు కాగా, అధ్యయనం చేసిన 18 ప్రాజెక్టుల్లో పూడిక కారణంగా 40.97 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిందన్నారు. వర్షపాతం, వరద ప్రవాహాల అంచనా, రిజర్వాయర్ల నిర్వహణలో ఏఐ వినియోగాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు