ఉబర్‌లో భారీ ఉద్యోగాల కోత.. 3,400 మందిపై ప్రభావం!

గ్లోబల్ రైడ్‌హైలింగ్ దిగ్గజం ఉబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌లో సుమారు 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో దాదాపు 3,400 ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ఉద్యోగాల కోత తక్షణ ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదని ఉబర్ స్పష్టం చేసింది. సంస్థలోని అనవసరమైన మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించడం, బ్యూరోక్రసీని తొలగించడం, సంస్థాగత నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపింది.

నిర్ణయాలు మరింత వేగంగా తీసుకునేలా సంస్థను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగానే ఉద్యోగాల కోత చేపడుతున్నట్లు ఉబర్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్న ఈ నిర్ణయం టెక్, గిగ్ ఎకానమీ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు