కొండా సురేఖకు షాక్‌.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు సీఎం రేవంత్‌ సిఫార్సు?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను క్యాబినెట్‌ నుంచి తొలగించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపినట్లు తెలుస్తోంది.

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని సీఎం తన లేఖలో కోరినట్లు సమాచారం. అధిష్ఠానం ఆదేశాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ సిఫార్సు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఇక సీఎం సిఫార్సు లేఖపై రాజ్‌భవన్‌ వర్గాలు, గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధిష్ఠానం ఆదేశాలు, సీఎం సిఫార్సుల నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు