‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఇటీవల సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తారక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ‘డ్రాగన్’ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ముందుగా కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ పూర్తయిన తర్వాత హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ యాక్షన్ బ్లాక్స్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే పలు కారణాలతో ‘డ్రాగన్’ షూటింగ్ ఆలస్యమైంది. ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా పడింది. ఇకపై ఎలాంటి ఆలస్యం జరగకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.









