ఐఫోన్‌ 18 ప్రోపై లీక్‌ వీడియో.. లాంచ్‌కు ముందే నెట్టింట వైరల్!

యాపిల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ ఈవెంట్‌కు సంస్థ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యాపిల్‌ తదుపరి తరం ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లైన ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మాక్స్‌ మోడళ్లను అధికారికంగా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సిరీస్‌పై ఇప్పటికే టెక్‌ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదే ఈవెంట్‌లో యాపిల్‌ తొలిసారిగా బుక్‌-స్టైల్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘ఐఫోన్‌ ఆల్ట్రా’ను కూడా ఆవిష్కరించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త ఐఫోన్‌ మోడళ్లలో డిజైన్‌, కెమెరా, పనితీరు వంటి విభాగాల్లో పలు కీలక మార్పులు ఉండొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే గ్రాండ్‌ లాంచ్‌కు కొన్ని గంటల ముందే ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. కొత్త ఫోన్‌ డిజైన్‌, ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో లాంచ్‌కు ముందే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి యాపిల్‌ అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు