శక్తినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.. సమస్యల పరిష్కారానికి హామీ

డివిజన్ పరిధిలోని శక్తినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి రోడ్ నంబర్‌ 7, రోడ్ నంబర్‌ 4 ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొత్తగా మంజూరైన రోడ్ నంబర్‌ 7 సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలపై స్థానికులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో వెంకటేశ్వర్ రెడ్డి చర్చించారు. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా కాలనీవాసులకు ఇబ్బందులు కలగకుండా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా పరిశీలించిన వెంకటేశ్వర్ రెడ్డి.. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు