మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న .. అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు.
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
క్రీడా మైదానాలను సుమారు 30 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన నాయకుడు… ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు
మణుగూరు మండలం, జిల్లా పరిషత్ హై స్కూల్(ZPHS) లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, MEO స్వర్ణ జ్యోతి,MDO శ్రీకాంత్,MPO వెంకటేశ్వరరావు, CI నాగబాబు, ZPHS హెచ్ఎం నాగశ్రీ, రామంజవరం కాంప్లెక్స్ హెచ్ఎం యశోద గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి వెళ్లాలని అన్నారు.
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుగారు క్రీడలను మరియు క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు,ZPHS క్రీడా మైదానాన్ని 10 లక్షలు నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని అలాగే డిగ్రీ కళాశాల క్రీడా మైదానానికి 15 లక్షల రూపాయల నిధులను కేటాయించి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో P.T లు అనిల్ కుమార్, ఆదినారాయణ మరియు ఉపాధ్యాయులు వి.వి. కోటేశ్వరరావు, బి శేఖర్ మండలంలో వివిధ స్కూళ్ల నుండి క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..









