SHAKTI పరిధిలోకి తీసుకురావద్దంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల వినూత్న నిరసన….

 

Today9TV News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరులోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ విద్యా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై గురువారం వినూత్న నిరసన చేపట్టారు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పోస్టుకార్డుల ద్వారా తమ సమస్యలను తెలియజేస్తూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను SHAKTI పరిధిలోకి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు “SHAKTI వద్దు–మా పాలిటెక్నిక్ విద్యను కాపాడండి”, “AICTE–SBTET వ్యవస్థను కొనసాగించాలి” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. తమ డిప్లొమా విద్యకు ఉన్న గుర్తింపు, ఉన్నత విద్యకు లభించే అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుత AICTE–SBTET విధానాన్ని కొనసాగిస్తూ విద్యార్థుల విద్యా ప్రయోజనాలను పరిరక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేందుకే పోస్టుకార్డు నిరసన చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు