Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరులో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడారు. రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, కమ్యూనిస్టుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని కోరారు, నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని సాబీర్ పాషా తెలిపారు.
భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఈ పోరాటంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, కమ్యూనిస్టుల నాయకత్వంలో సుమారు 24 లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించకుండా నిజమైన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
Post Views: 15









