బీజేపీ మండల అధ్యక్షుడిపై రాత్రంతా దాడి…? ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు….
ఢిల్లీ….ఢిల్లీలోని కంజావాలా బీజేపీ మండల అధ్యక్షుడు సునీల్‌ను సమావేశం పేరుతో పార్టీ కార్యాలయానికి పిలిపించి బంధించి దారుణంగా కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు
పైపులు, కర్రలు, బెల్టులతో రాత్రంతా దాడి చేశారని, ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేసి కార్యాలయాన్ని లోపలి నుంచి లాక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి
సునీల్‌ను వివస్త్రను చేసి కొట్టడంతో శరీరంపై తీవ్ర గాయాలయ్యాయని ఆయన సోదరుడు విజయ్ ఆరోపించారు.ఇది ఇలా ఉంటే కులం పేరుతో సైతం దూషించినట్లు కుటుంబం చెబుతోంది.
సునీల్ ను దారుణంగా కొట్టారని అందుకు సంబందించిన మెడికల్ రిపోర్టుతో పోలీసులను ఆశ్రయించినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కుటుంబం ఆరోపిస్తోంది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్యే గజేంద్ర దరాల్‌తో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.









