హైకోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ…

 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఎర్రవెల్లి పసుపు నీళ్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు), కేసులోని నిందితులను అరెస్ట్ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది..

నోటీసులు ఇచ్చి విచారణ: నిందితులను అరెస్ట్ చేయకుండా, చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి మాత్రమే దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు సూచించింది.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు: ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులలో నేరుగా ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల గుర్తుచేత: ఇటువంటి సందర్భాల్లో అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ.. వాటిని ఉల్లంఘించి మరీ మళ్లీ అరెస్టులకు ఎలా ప్రయత్నిస్తారంటూ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు