సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన సీఎం…
` Sept 16`
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీఅయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సిఎం వివరించారు.
ఇది ఇలా ఉంటే తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు సీఎం సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని, హైదరాబాద్ ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు సీఎం.
కాగా ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని సింగపూర్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అన్నిరకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేశారు. పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించటం గమనార్హం…
ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు…ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 29









