వినాయక నిమజ్జన ఏర్పాట్లపై డిఎస్పి రవీందర్ రెడ్డి, అధికారుల సమన్వయ సమావేశం…

Today9TV News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

మణుగూరు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, విద్యుత్‌ భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రేన్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు, ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరించాలని, నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉంటూ శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించాలని డీఎస్పీ సూచించారు.
వినాయక నిమజ్జనం నేపథ్యంలో మణుగూరు కొండాయిగూడెం ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతాన్ని నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు, ఎస్సై రవుఫ్, మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, ఎంపీడీవో, సింగరేణి ఎస్ ఓ శ్రీనివాస రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు