-
తెలంగాణలో పవర్ ప్లాంట్లపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్.
-
నేడు తెలంగాణలోని ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లలో బీఆర్ఎస్ బృందాల పర్యటన..
-
యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి, కాకతీయ, సింగరేణిథర్మల్ పవర్ ప్లాంట్లలో పరిశీలన…
Today 9…Digital wing…
తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పరిశీలన కోసం నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణలోని ప్రధాన థర్మల్ పవర్ ప్లాంట్లలో బీఆర్ఎస్ బృందాల పర్యటన సాగనుంది.యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి, కాకతీయ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లలో పరిశీలన చేయనున్నారు. వాటితో పాటు హైదరాబాద్లోని సింగరేణి హెడ్క్వార్టర్స్లోనూ బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది.
ఇది ఇలా ఉంటే యాదాద్రి పవర్ ప్లాంట్: మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో,కొత్తగూడెం పవర్ ప్లాంట్: రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు,భద్రాద్రి పవర్ ప్లాంట్: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,కాకతీయ పవర్ ప్లాంట్: ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి,….సత్యవతి రాథోడ్, గండ్ర వెంకట రమణారెడ్డి సింగరేణి పవర్ ప్లాంట్: జోగు రామన్న, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, బాల్క సుమన్, సింగరేణి హెడ్క్వార్టర్స్: కొప్పుల ఈశ్వర్, వివేకానంద గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు ఆధ్వర్యంలో పరిశీలన చేయనున్నారు.
కాగా ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం, ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల్లో జాప్యాలు, నిర్వహణ సమస్యలపై అధికారుల నుంచి వివరాలను సేకరించనున్నట్టు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ను ఏర్పాటు చేసినట్టు పార్టీ నాయకులు తెలియజేశారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వివరాలతో, బి ఆర్ ఎస్ పార్టీ నివేదిక సిద్ధం చేయనుంది. అయితే పర్యటన అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియాకు కీలక వివరాలు వెల్లడించనున్నట్టు తెలియ వచ్చింది.
Post Views: 23









