సింధు జలాలపై భారత్‌కు హెచ్చరికలు చేసిన షెహబాజ్ షరీఫ్ !!!

 

పాకిస్తాన్‌కు దక్కాల్సిన సింధు నది జలాల వాటాను ఆపేందుకు, అడ్డుకునేందుకు, దారి మళ్లించేందుకు చేసే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ 2025 ఏప్రిల్ నుంచి పక్కన పెట్టింది.
అలాగే, 2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ సమయంలో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ జోక్యం “వందలాది కోట్ల ప్రాణాలను కాపాడింది” అని అన్నారు.

​సింధు నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడం  “నీరు మాకు రెడ్లైన్” అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది…
సింధు జలాల ఒప్పందం రద్దు/తాత్కాలిక నిలిపివేత: భారత్ ఏకపక్షంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని (abeyance) వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.
​ “సింధు నదిలో ప్రతి నీటి బొట్టు పాకిస్తాన్‌కు రెడ్ లైన్ అంటూ భారత్ కనుక తన వైఖరిని మార్చుకోకపోతే ప్రత్యక్షంగా సమాధానం చెప్తాం” అని హెచ్చరించారు. నీటిని రాజకీయంగా లేదా యుద్ధ ఆయుధంగా ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.
​ ఇది ఇలా ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు అలాగే సరిహద్దుల్లో చొరబాట్లు ఆపేవరకు పాకిస్తాన్‌తో నీటి ఒప్పందాల అమలును యథాతథంగా కొనసాగించలేమని భారత్ స్పష్టం చేసింది. 1960 ఒప్పందం ప్రకారం తూర్పు నదుల (రవి, బియాస్, సట్లెజ్) పై భారత్‌కు, పశ్చిమ నదుల (సింధు, జీలమ్, చీనాబ్) పై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి. అయితే పశ్చిమ నదులపై కూడా నిబంధనల ప్రకారం జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించే హక్కు భారత్‌కు ఉందన్నది నిర్వివాదాంశం

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు