UNGAలో జైశంకర్ వార్నింగ్.. ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్ !

UNGAలో జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు .. ఉగ్రవాదంపై  కాంప్రమైజ్ కాబోమని తేల్చి చెప్పారు.

 

81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని సాధారణ అంశంగా చూపించే ప్రయత్నాలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని జైశంకర్ తేల్చిచెప్పారు. సభ వేదికగా ఉగ్రవాదాన్ని పదేపదే ప్రోత్సహించిన ఓ వ్యక్తి వాస్తవాలను వక్రీకరించారని పరోక్షంగా పాకిస్థాన్ వైఖరిని జై శంకర్ విమర్శించారు.

ఇది ఇలా ఉంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని, అవసరమైనప్పుడు ఆ హక్కును భారత్ తప్పకుండా వినియోగిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, స్నేహసంబంధాలు ఎప్పటికీ కలిసి పయనించలేవని జైశంకర్ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని State Policyగా వాడుకుంటున్న దేశాలను కచ్చితంగా బాధ్యులను చేయాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు….

 

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు